ఉగాది సెలబ్రేషన్స్.. ఇలా తయారవండి.. మీరే అట్రాక్షన్ అవుతారు

ఉగాది సెలబ్రేషన్స్.. ఇలా తయారవండి.. మీరే అట్రాక్షన్ అవుతారు

 ఉగాది పండుగ రోజును ఎంతో ఆనందంగా ఉంటారు.  షడ్రుచుల సమ్మేళనంతో పిండివంటలతో ఆరగించిన తరువాత.. కొన్ని అపార్ట్​ మెంట్లలో సెలబ్రేషన్స్​ జరుపుకుంటారు.  అలా నలుగురిలోకి వెళ్లినప్పుడు  మీరు స్పెషల్​అట్రాక్షన్​ అవ్వాలంటే ఏం చేయాలి..  ఫెస్టివల్​ లుక్​ తో మెరవాలంటే  ఎలాంటి ఫేస్​ ప్యాక్​ వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..! 

ఉగాది పండుగరోజు.. జనాలకు  కొత్త ఆశలు.. కొత్త ఉత్సాహం పరుగులు పెడుతుంది.  ఆ రోజు ఆనందమే కాదు.. అందం కూడా చాలా ముఖ్యమే కదా..! పండుగ అంటే పూజలు.. గుళ్ల దర్శనాలు కామన్​.. ఇవి ఎలాగూ ఉంటాయి.  ఇలాంటి సమయాల్లో  బ్యూటీఫుల్​ గా కనిపించాలనిబ్యూటీ టిప్స్ ట్రై చేస్తుంటారు.ఇలా చేస్తే  ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లోనే పార్లర్ గ్లోతో  మీరే స్పెషల్ ఎట్రాక్షన్ అవుతారు.

పసుపు, పెరుగు ప్యాక్:   పసుపు, పెరుగు ప్యాక్  మంచి రిజల్ట్ చూపిస్తుంది. దీనిని ఫేస్​ కు రాసుకొని అరగంట తరువాత క్లీన్​ చేసుకోవాలి.   పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు చర్మాన్ని లోపల నుంచి క్లీన్ చేస్తుంది.  పెరుగు చర్మానికి తేమను అందిస్తుంది. ఇలా చేస్తే  ఉగాది రోజు ఫేస్​ నిగ నిగ మెరిసిపోతుంది

ఎలా తయారు చేయాలంటే..!

 ఒక స్పూన్​ పెరుగును.. చిటికెడు పసుపును  ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్​ చేయాలి. కావాలంటే రెండు చుక్కలు తేన కూడా కలుపుకోవాలి.  ఈ మిశ్రమాన్ని ఫేస్ కు అప్లై చేసి అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని క్లీన్​ చేసుకుంటే ఫేస్​ గ్లో అదిరిపోద్ది.  పండుగ రోజు మేకప్ వేసుకునే ముందు ఈ ప్యాక్ వేసుకుంటే చర్మం బ్రైట్‍గా, సాఫ్ట్ గా కనిపించడంతో పాటు మేకప్ ఈవెన్‍గా సెట్ అవుతుంది.

ఇంకా ఏమేమి చేయాలంటే..!

  •  ఉదయం లేచిన వెంటనే చక్కగా స్నానం చేసి రోజ్ వాటర్‍తో ముఖాన్ని తుడుచుకుంటే ఫ్రెష్‍గా ఉంటుంది.
  • రోజంతా నీళ్లు తాగడం కూడా చర్మ ఆరోగ్యానికి మంచిది. 
  • నూనె పదార్థాలు తినకపోవడం బెటర్. ఫ్రూట్స్, తేలికపాటి ఆహారం తినాలి.
  •  ముందురోజు సరైన నిద్ర చాలా అవసరం. 
  • ఇలా చేస్తే  బ్యూటీ ప్రోడక్ట్స్  ఖర్చు లేకుండానే స మీ ముఖం మెరిసిపోతుంది. ఈ ఉగాదికి మీ అందంతో అందరిని ఆకర్షిస్తారు.